Nagarjuna: "వారి మీద నాకు నమ్మకం ఉంది" అంటున్న నాగార్జున

* వారిద్దరికీ బాధ్యత ఉంది అంటున్న అక్కినేని హీరో

admin1
Updated on: 19 Oct 2021 8:30 PM IST
Nagarjuna Says i have Full Confidence on Akhil and Naga Chaitanya
X

వారిద్దరికీ బాధ్యత ఉంది అంటున్న అక్కినేని హీరో(ట్విట్టర్ ఫోటో)

Nagarjuna: హీరోలుగా అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ మంచి పేరు సంపాదించినప్పటికీ వారి వ్యక్తిగత జీవితం గురించి వారి తండ్రి నాగార్జునకి ఎంతో కొంత బాధ ఖచ్చితంగా ఉంది. మరోవైపు ఈ మధ్యనే నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంత తో విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున ఇలా అన్నారు, "మనం ఎంత కంగారు పడినా సరే డెస్టినీ అనేది మారదు. నా ఇద్దరు కొడుకులకి వారి వారి జర్నీ ఉంది. ప్రొఫెషనల్ గా అయినా వ్యక్తిగతంగా వారి జీవితంలో ఒడిదుడుకులు సహజం. కానీ వారు ఇద్దరూ బాధ్యత తెలిసిన యువకులు. వారి మీద నాకు నమ్మకం ఉంది" అని అన్నారు నాగార్జున.

"సక్సెస్ మరియు ఫెయిల్యూర్ రెండు జీవితంలో భాగాలే. నేను కూడా నా జీవితంలో చాలా నేను ఒడిదొడుకులను, ఎత్తుపల్లాలను చూశాను. నేను నేర్చుకున్నది ఏంటంటే ఏదీ శాశ్వతం కాదు" అని అన్నారు నాగార్జున. సినిమాల పరంగా మాట్లాడుతూ ఫ్యామిలీ డ్రామా లు మరియు లవ్ స్టోరీ లు చేసి బోర్ కొట్టిందని, ఒక యాక్షన్ సినిమా చేయాలని ఉందని అన్నారు. అంతేకాకుండా ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమాతో మంచి ఆదరణ అందుకున్న నాగార్జున తన తదుపరి సినిమాలు కూడా చాలా వరకు యాక్షన్ బేస్ చేసుకునే ఉంటాయని తెలిపారు.

admin1

admin1

Next Story