Nagarjuna: సమంతే మొదట విడాకులు కోరింది

Nagarjuna: చైతు, సమంత విడాకులపై నాగార్జున కీలక వ్యాఖ్యలు

Rama Rao
Updated on: 27 Jan 2022 3:55 PM IST
Nagarjuna Said Samantha Wanted Divorce from Naga Chaitanya | Tollywood News
X

 చైతు, సమంత విడాకులపై నాగార్జున కీలక వ్యాఖ్యలు

Nagarjuna: నాగచైతన్య, సమంతల విడాకులపై తొలిసారిగా కింగ్ నాగార్జున బాలీవుడ్ మీడియాలో స్పందించారు. వారిద్దరిదీ ఎంతో అన్యోన్యమైన జంట అన్నారు.. ఇద్దరి మధ్యా పెద్దగా గొడవలేమీ లేవని, మొదట సమంతే విడాకులు కోరిందని నాగార్జున తెలిపారు. సమంతనిర్ణయాన్ని చైతన్య గౌరవించాడని అన్నారు.ఇద్దరి మధ్యా విడిపోయేంత సమస్యలేమీ లేవని, గతేడాది న్యూఇయర్ కూడా ఇద్దరూ కలిసే జరుపుకున్నారని అన్నారు. ఆ తర్వాతే వారి మధ్య ఏదో సమస్య వచ్చిందని ఆ సమస్య ఏంటన్నది తనకు కచ్చితంగా తెలియదనీ అన్నారు. సమంత విడాకుల విషయంలో చైతూ ఎంతో మెచ్యూర్డ్ గా వ్యవహరించాడని, తన గురించి, కుటుంబ పరువు, మర్యాద గురించి ఎక్కువ ఆలోచించాడనీ నాగార్జున కామెంట్ చేశారు.


Rama Rao

Rama Rao

Next Story