బ్లాక్ బస్టర్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్న నాగార్జున

Nagarjuna Movie will Create Records Again
x

బ్లాక్ బస్టర్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్న నాగార్జున

Highlights

Nagarjuna: మళ్లీ రికార్డులు సృష్టించనున్న నాగార్జున సినిమా

Nagarjuna: ఈమధ్య కాలంలో రీ రిలీజ్ ల హడావిడి ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీల పుట్టినరోజులు సందర్భంగా పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, వంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలయ్యి మంచి కలెక్షన్లు కూడా నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా జల్సా సినిమా మిగతా రెండు సినిమాలతో పోలిస్తే భారీ కలెక్షన్లు నమోదు చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అతి త్వరలోనే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన సూపర్ హిట్ సినిమా బిల్లా కూడా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరోవైపు ఇంద్ర సినిమా కూడా లైన్లో ఉండగా తాజాగా ఇప్పుడు నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

"శివ ని డిజిటల్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. కొన్ని రీల్స్ మిస్ అవ్వడంతో వాటిని వెతికే పనిలో పడ్డాము. శివ అని కాదు నా హిట్ సినిమాలు చాలా వరకు రీ రిలీజ్ చేయాలన్న ప్లాన్ కూడా ఉంది. కానీ కొన్నిటికి రీల్స్ మాత్రం దొరకడం చాలా కష్టమైపోయింది" అని స్వయంగా చెప్పారు నాగార్జున. ఇక తాజాగా నాగార్జున హీరోగా నటించిన "ది ఘోస్ట్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమా తో పాటు విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దానికి ధీటుగా గట్టి పోటీ ఇస్తోందని చెప్పుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories