ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకున్న నాగార్జున

Nagarjuna Escaped from a Flop Movie
x

ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకున్న నాగార్జున

Highlights

Nagarjuna: నాగార్జునకి బదులుగా రవితేజ ఖాతాలోకి వెళ్లిన డిజాస్టర్ సినిమా

Nagarjuna: "క్రాక్" సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ఈమధ్యనే విడుదలైన "ఖిలాడీ" సినిమాతో పర్వాలేదు అనిపించారు. తాజాగా ఇప్పుడు శరత్ మండవ దర్శకత్వంలో "రామారావు ఆన్ డ్యూటీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నిన్న అనగా జులై 29 న థియేటర్లలో విడుదలైంది. కానీ మొదటి రోజు నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమా కథ బాగానే ఉన్నప్పటికీ అది రవితేజ ఇమేజ్ కి సూట్ అయ్యే కథ కాదని అందరూ చెబుతున్నారు. శరత్ మండవ మైండ్ లో ఉన్న హీరో రవితేజ కాదని ఈ సినిమా కథ రవితేజ కి ఏ మాత్రం సూట్ అవ్వలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి శరత్ మండవ ఈ సినిమా కథను నాగార్జున ని దృష్టిలో పెట్టుకొని రాసారట. ముందుగా ఈ సినిమా కథను నాగార్జునకే వినిపించారు కానీ కథ విన్నాక నాగార్జున తనకంటే కొంచెం యంగ్ హీరో అయితే బాగుంటుందని ఫ్లాష్ బ్యాక్ లో ఉండే లవ్ స్టోరీ కి సెట్ అవుతుందని అన్నారట. అలా నాగార్జున వదిలేసిన ఈ కథ రవితేజ చేతిలోకి వచ్చింది. కానీ అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా ఇలాంటి సీరియస్ డ్రామాలో రవితేజ ని అభిమానులు కూడా చూడలేకపోయారు. నాగర్జున నటించినా ఈ సినిమా కొంచెం బెటర్ గా ఉండేదేమోనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా నాగార్జున ఒక డిజాస్టర్ సినిమా నుంచి తప్పించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories