Nagarjuna: సినీ ప్రముఖుల జీవితాలను ఇలా వాడుకోవద్దు.. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున

Nagarjuna Condemns Minister Konda Surekha Comments
x

Nagarjuna: సినీ ప్రముఖుల జీవితాలను ఇలా వాడుకోవద్దు.. కొండా సురేఖకు వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున

Highlights

Nagarjuna: నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ నటులు నాగార్జున తప్పుబట్టారు.

Nagarjuna: నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ నటులు నాగార్జున తప్పుబట్టారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని కోరారు. దయచేసిన ఇతరుల వ్యక్తిగతవిషయాలను గౌరవించండి. మా కుటుంబంపై మీరు చేసిన వ్యాఖ్యలు అసంబద్దం. అబద్దం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసకోవాలని ఆయన కోరారు.

Also Read: Konda Surekha: 'సమంత, నాగ చైతన్యల విడాకులకు కేటీఆరే కారణం... ఓపెన్‌గా చెబుతున్నా'

నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని బుధవారం మధ్యాహ్నం మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు సినీ రంగాన్ని వదిలిపెట్టడానికి ఆయనే కారణమన్నారు. అంతేకాదు కొందరు త్వరగా పెళ్లి చేసుకొని వెళ్లడానికి కూడా కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఎక్స్ లో హీరో నాగార్జున స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories