అదరగొట్టిన సీనియర్ హోస్ట్ కిచ్చా సుదీప్

అదరగొట్టిన సీనియర్ హోస్ట్ కిచ్చా సుదీప్
x
Highlights

* బిగ్‌ బాస్‌లో సండే ఫన్‌డే * నాగ్ పాటలకు కంటెస్టెంట్ల డ్యాన్స్ * చీకటి గదిలో ధైర్యం.. స్థైర్యం అనే గేమ్‌ ఆడిన సభ్యులు * చీకటి గదిలోకి వెళ్లి ప్రేక్షకులను ఆకట్టుకున్న హౌస్‌మేట్స్

బిగ్ బాస్ లో ఆదివారం ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. చీకటి గదిలోకి వెళ్ళి మూడు వస్తువులని తీసుకురమ్మని చెప్పిన నాగార్జున, అందరి చేత మూడు వస్తువులు తెచ్చేలా చేశారు. ఒక్కొక్కరుగా హౌస్ లో వెళ్ళినావారిలో ఆడవాళ్ళందరూ చాలా ధైర్యంగా కనిపించారు. హారిక, మోనాల్, చివరికి ఆరియానా కూడా అంతగా భయపడలేదు. మగవాళ్ళలో అఖిల్, సోహైల్, అవినాష్ గజగజ వణీకిపోయారు. అభిజిత్ ఒక్కడే సాఫీగా టాస్క్ పూర్తి చేసాడు.

హోస్ట్ నాగార్జున వేదికపైకి రాగానే ఆయనకు ఇంటి సభ్యులు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగ్ నటించిన సినిమాల పాటలకు ఇంటి సభ్యులందరూ డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. అభిజిత్‌ కూడా డ్యాన్స్ చేయడం విశేషంగా మారింది. మంచిగా డ్యాన్స్ చేసిన అభిజిత్‌ను నాగ్ ప్రశంసించారు.

ఇక చీకటి గదిలో ధైర్యం. స్థైర్యం అనే గేమ్‌ను ఇంటి సభ్యులతో ఆడించారు. డార్క్ డ్రాకుల్లా రూమ్‌లోకి ఇంటి సభ్యులను పంపించి మూడు వస్తువుల గుర్తించాలి. అలా ఇంటి సభ్యలను చీకటి గదిలోకి పంపించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

త‌ర్వాత సోహైల్‌ లోప‌ల‌కు వెళ్ల‌గా భ‌య‌ప‌డుతూనే ఒక్కో అడుగు ముందుకు వేశాడు. గ‌జ్జెల శ‌బ్ధం విన‌ప‌డేస‌రికి గ‌జ‌గ‌జ వ‌ణికిపోయాడు. అఖిల్ భ‌యాన్ని క‌వ‌ర్ చేసుకునే ప్రయ‌త్నం చేశాడు. అభిజిత్ అయితే ఈల‌లు వేసుకుంటూ మ‌రీ వెళ్లాడు కానీ లోప‌ల కొంచెం భ‌యంగా ఉండేన‌ని చెప్పాడు. ఇక అవినాష్ దెయ్యం అరుపుల‌కు ద‌డుసుకుంటూనే రూమ్ అంతా క‌లియ‌తిరిగాడు. లోనికి వెళ్లిన‌ హారిక, మోనాల్‌ ఏమాత్రం అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు. త‌ర్వాత అరియానా ధైర్యం తెచ్చుకుని ఒంట‌రిగా చీక‌టి గ‌దిలోకి వెళ్లి వచ్చింది.

బిగ్ బాస్ షోలో సన్ డే వచ్చిందంటే చాలు.. చాలా స్పెషల్స్ ప్లాన్ చేస్తుంటారు నిర్వాహకులు. అందులో భాగంగానే ఈ వారం కన్నడ సూపర్ స్టార్ సుదీప్ షోకు వచ్చాడు. ఎవరితో ఎలా ఆడుకోవాలి. ఏ కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నాడనే విషయాలపై సుదీప్‌కు పూర్తిగా పట్టుంది. ఇక తెలుగు బిగ్‌ బాస్‌ స్టేజీపైకి వచ్చి తన హోస్టింగ్ టెక్నిక్స్ కూడా చూపించాడు సుదీప్‌.

కన్నడ బిగ్ బాస్ వరుసగా ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్. తెలుగు బిగ్ బాస్ స్టేజ్‌ పై సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని అలరించారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యుల్ని సర్ ప్రైజ్ చేసేందుకు నాగార్జున ఇంటికి వెళ్లిపోయారని నేనే హోస్ట్ చేస్తా అంటూ కంటెస్టెంట్స్‌‌కి సర్ ప్రైజ్ ఇచ్చారు సుదీప్.

అవినాష్, అఖిల్‌ను చిలిపి ప్రశ్నలతో ఆటాడుకొన్నారు. ఇంటిలో ముగ్గురు అమ్మాయిల్లో ఎవరిని పెళ్లి చేసుకొంటావు.. ఎవరిని డేట్ చేసుకొంటావు? ఎవరిని చంపుతావు? అంటే మోనాల్ డేట్ చేసి.. హారిక ను పెళ్లి చేసుకొంటా. అరియానా‌ను కిల్ చేస్తాను అని చెప్పాడు.

ఇక ఆతర్వాత నామినేషన్‌లో ఉన్న ముగ్గురిలో అఖిల్‌ను సుదీప్ కిచ్చ సేవ్ చేశాడు.

ఇక ఎలిమినేషన్ కోసం అరియానా, అవినాష్ ఇంటిలో మిగిలారు. దీంతో హౌస్‌లో హైడ్రామా మొదలైంది.

ఇక ఎలిమినేషన్‌కు ముందు అవినాష్ బిగ్ క్వశ్చన్ పెట్టారు. ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఉపయోగించుకొంటావా? లేక వచ్చే వారం ఉపయోగించుకొంటావా లేదా ఎవరి కోసమైనా ఉపయోగించుకొంటావా అని నాగ్‌ ప్రశ్నించాడు. చివరికి రూల్‌ చెప్పి గేమ్ మొదలు చెప్పిన నాగ్‌ అవినాష్‌కు షాక్‌ ఇచ్చాడు.

ఈవారం నామినేషన్స్‌లో అరియానా, అవినాష్‌లు మాత్రమే మిగలడంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు తెలిపారు నాగార్జున. నామినేషన్ టాస్క్‌లో ఉపయోగించినట్టుగానే కలర్ టోపిలను వారి ముందు పెట్టారు. ఇద్దరు చెరో టోపిలో చేయి పెట్టాలి. ఎవరి చేతికి గ్రీన్ కలర్ వస్తుందో వారు సేఫ్ అయినట్టు. ఎవరి చేతికి రెడ్ కలర్ వస్తుందో వారు ఎలిమినేట్ అవుతారు అని గేమ్ రూల్‌ను నాగ్ చెప్పారు.

ఇక ఎలిమినేషన్‌కు ముందు అవినాష్ బిగ్ క్వశ్చన్ పెట్టారు. ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఉపయోగించుకొంటావా? లేక వచ్చే వారం ఉపయోగించుకొంటావా లేదా ఎవరి కోసమైనా ఉపయోగించుకొంటావా అంటూ నాగ్ అడిగాడు. చివరకు తన కోసమే ఉపయోగించుకొంటానని అవినాష్ చెప్పారు.

ఆ తర్వాత చేతిని క్యాప్ నుంచి బయటకు తీయమని చెప్పగా అవినాష్ చేతికి రెడ్. అరియానా చేతికి గ్రీన్ కలర్ వచ్చింది. దాంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో అవినాష్, ప్రేక్షకుల ఓట్లతో అరియానా సేవ్ అయ్యారు. దీంతో ఇంటిలో సూపర్ సెవెన్ టీమ్ అలాగే ఉండిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories