ఒకే తరహా సినిమాలు చేస్తున్న అక్కినేని తండ్రి కొడుకులు

Nagarjuna and Akhil Will Try Their Luck with Action Films
x

ఒకే తరహా సినిమాలు చేస్తున్న అక్కినేని తండ్రి కొడుకులు

Highlights

ఒకే తరహా సినిమాలు చేస్తున్న అక్కినేని తండ్రి కొడుకులు

Nagarjuna-Akhil: అక్కినేని నాగార్జున తనయుడిగా, అక్కినేని నాగచైతన్య తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని యువ హీరో అఖిల్ తన కెరియర్ లో నాలుగు సినిమాలు చేశాడు. వరుసగా మూడు డిజాస్టర్లను అందుకున్న అఖిల్ ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ఏజెంట్" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు అఖిల్.

మరోవైపు అక్కినేని నాగార్జున కూడా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసింది. ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగ్ తాజాగా ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో "ఘోస్ట్" సినిమాలో నటిస్తున్నారు.తాజాగా ఈ రెండు సినిమాలలో వీరిద్దరి పాత్రల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. టీజర్ లో నాగార్జునతో ఖడ్గం తో కనిపించిన సంగతి తెలిసింది.

మరోవైపు ఏజెంట్ సినిమా కోసం అఖిల్ గన్స్ పట్టుకొని చాలా స్టైల్ గా ఫోటోలకి పోసి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయని, అవే సినిమాలకి హైలైట్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి తండ్రి కొడుకులలో ఎవరు తమ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తారో అని ఇంకా వేచి చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories