నాగబాబు కొత్త షో ప్రోమో 'అదిరింది'..నీహారికా అదరగొట్టిందిగా!

నాగబాబు కొత్త షో ప్రోమో అదిరింది..నీహారికా అదరగొట్టిందిగా!
x
Nagababu in Adirindi show
Highlights

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు జీ టీవీలో కొత్త షో తో రానున్నారు. అదిరింది పేరుతొ ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షో ప్రోమ్ విడుదల అయింది.

జబర్దస్త్ కి బై చెప్పేశాకా మెగా బ్రదర్ నాగబాబు జీ తెలుగు లో వస్తున్నా అన్నారు. అన్నట్టుగానే వచ్చేస్తున్నారు. అలాగా ఇలాగా కాదు..'అదిరింది' అంటూ దూసుకు వచ్చేస్తున్నారు. ఈ ఆదివారం ఆ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్..అంటూ నాగబాబు కొత్త షో జీ తెలుగులో ప్రారంభం కాబోతోంది. దీని తాజా ప్రోమో విడుదల చేశారు.

మొదటి ప్రోమో లోనే నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ చూపిస్తూ సందడి చేశారు. దానిలో అయన ఎంట్రీ తప్ప మరొకటి కనిపించలేదు. ఇప్పుడు ఈ ప్రోమోలో నాగబాబు తో పాటు నీహారిక కూడా కనిపించారు. స్పెషల్ జడ్జిగా ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె పూర్తి స్థాయి న్యాయనిర్ణేతగా ఉండకపోవచ్చని టాక్.

ఇక బుల్లి తెరపై పలు సీరియళ్ళలో మెరిసిన సమీరా షరీఫ్ 'అదిరింది' షో కి యాంకర్ గా కనిపించింది ప్రోమో లో. ఇక ఈ ప్రోమోలో షో కి సంబంధించి కొన్ని విషయాలు రివీల్ చేశారు. ఇది కూడా జబర్దస్త్ ప్యాట్రన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్ ఇలా సీనియర్ జబర్దస్త్ కమెడియన్లు అందరూ కనిపించారు.

ముందునుంచీ ప్రచారంలో ఉన్నట్టు అనసూయ కనిపించలేదు. ఇక ప్రోమోలో జబర్దస్త్ మీద అదిరిపోయే పంచ్ లు వినిపించాయి. మొదటి పంచ్ నీహారిక వేసింది. మీరు ఈరోజు స్పెషల్ గెస్ట్ గా రావడం బావుంది అని యాంకర్ అంటే..''స్పెషల్ గెస్ట్ గా రావడం ఏమిటి. ఇదంతా నా ఫ్యామిలీ.. ఎందరున్నారనేది కాదు.. ఎవరున్నారనేది ముఖ్యం'' అంటూ నీహారిక చెప్పారు. ఇక వేణుని ఒక క్యారెక్టర్ ''ఇక్కడ నుంచి నిన్ను ఎక్కడికో తీసుకుపోతాను'' అంటాడు. దానికి వేణు ''ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను..ఇంకెక్కడికీ పోను.'' అంటూ పంచాడు. ఇక జబర్దస్త్ మీద పంచ్ లు వదిలేస్తే.. ధనరాజ్ నాగబాబు గారి ఎడ్రస్ కావాలి అని యాంకర్ ను అడిగిన సందర్భంలో..ఆమె నన్ను పట్టుకో.. అంటే.. నిన్ను పట్టుకుంటే, తర్వాత మా ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి అంటాడు. దానికి నాగబాబు అలా చాలా సార్లు అయింది అని తన స్టైల్ లో పంచ్ వేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోందండీ అని ఒక లేడీ ఆర్టిస్ట్ ఆర్ఫీ తో అంటే.. ఎందుకు అని ఆర్ఫీ అడుగుతాడు. దానికి ఆమె మాడిపోయిన పెనం మీద దోష ఎలా వేస్తారా అని పంచ్ వేస్తుంది.

ఇక అన్నిటికన్నా చివరగా అప్పుడే అయిపోలేదు..ఇప్పుడే మొదలైంది అంటూ పవన్ స్టైల్ లో ఆడండంతో ప్రోమో ముగిసింది. మొత్తమ్మీద ఈ అదిరింది..జబర్దస్త్ కన్నా భిన్నంగా అయితే కనిపించలేదు. మరి అదే కాన్సెప్ట్ తో దీనిని ఎంత వరకూ ముందుకు తీసుకు వెళ్లగలరనేది మొదటి ఎపిసోడ్ చూసేవరకూ ఆగాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories