'వరుడు కావలెను'....! రీతువర్మ, నాగశౌర్య మూవీ న్యూ ఇయర్ పోస్టర్

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక 'రీతువర్మ' జంటగా...
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక 'రీతువర్మ' జంటగా 'లక్ష్మీ సౌజన్య' ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి 'వరుడు కావలెను' అనే పేరును నిర్ణయించిన విషయం విదితమే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాదు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. . 'వరుడు కావలెను' అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్ననమ్మకాన్నివ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ సందర్భంగా ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు.ఈ చిత్రంలో చూడ ముచ్చటగా 'నాగ శౌర్య , రీతువర్మ' ల జంట కనిపిస్తుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు. నిర్మాత సూర్య దేవర నాగవంశీ
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT