మత్స్యకారులకు స్వయంగా చేపల పులుసు చేసిన నాగచైతన్య.. వీడియో వైరల్

Naga chaithanya prepared fish curry on his own
x

మత్స్యకారులకు స్వయంగా చేపల పులుసు చేసిన నాగచైతన్య.. వీడియో వైరల్

Highlights

Naga chaithanya fish curry: చేపల పులుసు అందరూ చేస్తారు. చాలా మంది తింటారు. కానీ నాగ చైతన్య చేసిన చేపల పులుసు తినే అవకాశం అందరికీ దొరకదు. కానీ ఆ...

Naga chaithanya fish curry: చేపల పులుసు అందరూ చేస్తారు. చాలా మంది తింటారు. కానీ నాగ చైతన్య చేసిన చేపల పులుసు తినే అవకాశం అందరికీ దొరకదు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కింది. నాగచైతన్య స్వయంగా తన చేత్తో చేపల పులుసు వండాడు. తండేల్ సినిమా షూటింగ్ సందర్భంగా కొంతమంది మత్స్యకారులకు నాగచైతన్య స్వయంగా తన చేత్తో చేపల పులుసు వండి వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఉత్తరాంధ్రలో జరుగుతోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం తీరాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మత్స్యకారుడి పాత్ర పోషించేందుకు నాగచైతన్య కొందరు మత్స్యకారుల జీవితాలను దగ్గర్నుంచి పరిశీలించి, తనను తను ఆ రకంగా మలుచుకున్నారు.

అయితే చైతూ వంట చేయడం వెనక ఓ రీజన్ కూడా ఉందంట. తండేల్ సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందు కొన్ని మత్స్యకార గ్రామాల్ని సందర్శించాడు. వాళ్లు వండిపెట్టిన ఆహారం తిన్నాడు. అప్పుడే ఏదో ఒక రోజు తను కూడా వాళ్ల కోసం చేపల పులుసు చేస్తానని మాట ఇచ్చాడంట నాగ చైతన్య. ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి చూపించాడు.

కట్టెల పొయ్యిపై మట్టి పాత్రను పెట్టారు. అందులో కొంచెం నూనె పోశారు. అంతకంటే ముందే శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలను వేసి, ఉప్పు, కారం, పసుపు దట్టించారు. తగినంత చింతపండు పులుసు పోసి, చివర్లో కాస్తంత కొత్తమీర చల్లారు. మొత్తానికి ఘుమఘుమలాడే చేపల పులుసును తయారు చేశాడు. అక్కడ ఉన్న వారికి ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు. ఫస్ట్ టైం చేపల పులుసు చేశానని.. బాగా లేకపోతే ఏం అనుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు. అది తిన్న వారందరూ వాహ్ అని మెచ్చుకున్నారు. దీంతో చైతన్య కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. నాగచైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా మెప్పించిన నాగ చైతన్య.. ఇప్పుడు మాస్ హీరోగా మారాడు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ఇక తండేల్ సినిమా కోసం చైతన్య లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో మాస్ అవతారంలోకి మారాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories