Naga Chaitanya:నాగ చైతన్య రికార్డ్.. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తండేల్

Naga Chaitanya Thandel Grosses 100 Crore Mark
x

నాగ చైతన్య రికార్డ్.. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తండేల్

Highlights

తండేల్ చిత్రంతో నాగ చైతన్య సరికొత్త రికార్డు సృష్టించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

Naga Chaitanya: తండేల్ చిత్రంతో నాగ చైతన్య సరికొత్త రికార్డు సృష్టించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు చిత్ర బృందం ప్రకటించింది.

సినిమా విడుదలైన కేవలం 9 రోజుల్లోనే తండేల్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో అటు అక్కినేని ఫ్యామిలీ ఇటు అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక మొదటి సారి నాగచైతన్య రూ.100 కోట్ల మైలురాయిని సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అక్కినేని హీరో రూ.వంద కోట్ల మార్క్ టచ్ చేయడం తొలిసారి కావడం గమనార్హం. నాగార్జున, అఖిల్ సహా ఇంకెవరూ దీనిని అందుకోలేదు. దీంతో రూ.వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన తొలి అక్కినేని హీరోగా నాగచైతన్య రికార్డ్ క్రియేట్ చేశారు.

విడుదలైన తొలి రోజే ఆన్‌లైన్‌లో పైరసీ వెర్షన్ రిలీజ్ కావడం తర్వాత ఏపీ ఆర్టీసీ బస్సులోనూ సినిమా విడుదల కావడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ అలాంటి అవాంతరాలను దాటుకుని మరీ తండేల్ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. మొదటి నుంచి కూడా తండేల్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా చైతూ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని అటు ఫ్యాన్స్ ఇటు క్రిటిక్స్ సైతం చైతూపై ప్రశంసలు కురిపించారు. అనుకున్నట్టే ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచింది.

ఓవర్‌సీస్‌లోనూ వన్ మిలియన్ మార్క్‌‌‌ను చేసుకుంది. గీతా ఆర్ట్స్‌లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలవడం సంతోషంగా ఉందని మేకర్స్ తెలిపారు. లాంగ్‌రన్ లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి తండేల్‌తో నాగ చైతన్య వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్ఫించగా బన్నీ వాసు నిర్మించారు.

తండేల్ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడి పాత్రలో నటించి మెప్పించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు. లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. ఇక దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories