Love Story - Chaitanya: అందులో సగం క్రెడిట్ సాయిపల్లవిదే అంటున్న నాగచైతన్య

* కాంప్లెక్స్ స్టెప్పులను కూడా సాయి పల్లవి తనకి చాలా సింపుల్ గా నేర్పించింది * ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది

admin1
Updated on: 8 Oct 2021 6:03 PM IST
Naga Chaitanya Said that Half of the Credits Belongs to Sai Pallavi in Love Story Movie | Movie News Today
X

లవ్ స్టోరీ సినిమా లో సగం క్రెడిట్ సాయిపల్లవిదే అంటున్న నాగచైతన్య (ఫోటో- ది హన్స్ ఇండియా) 

Love Story - Naga Chaitanya: ప్రస్తుతం అక్కినేని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "లవ్ స్టోరీ". అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్య తో రొమాన్స్ చేయనుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇక ఆ సినిమా ట్రైలర్ చూశాక సినిమా అంచనాలకు మించి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

చైతు నటన సాయి పల్లవిని డామినేట్ చేసిందని చాలా మంది చెబుతున్నారు. నటన పరంగా పక్కనపెడితే నాగచైతన్య డాన్స్ తో ఇప్పటి దాక ఇంప్రెస్ చేయలేదని చెప్పుకోవాలి. కానీ "లవ్ స్టోరీ" ట్రైలర్ చూస్తే సాయి పల్లవి తో పోటీపడి మరి నాగ చైతన్య డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయమై మాట్లాడుతూ ఈ సినిమా జర్నీ తనని మంచి నటుడిగా తయారు చేసిందని అన్నారు. అంతేకాకుండా కాంప్లెక్స్ స్టెప్పులను కూడా సాయి పల్లవి తనకి చాలా సింపుల్ గా నేర్పించింది అని, తనని ఎవరైనా పొగిడితే అందులో సగం క్రెడిట్ సాయి పల్లవికి మరియు శేఖర్ గారికి చెందుతుంది అని అన్నారు నాగ చైతన్య.

admin1

admin1

Next Story