Thandel OTT: తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Naga Chaitanya Sai Pallavi Thandel Movie Streaming March 14 On Netflix
x

 తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Highlights

తండేల్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

Thandel OTT: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ తమ నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌‌గా ఎదురు చూస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

తండేల్ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని.. మంచి వసూళ్లను రాబట్టింది. ఇక చైతూ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో రాజు, సత్య పాత్రలో నాగ చైతన్య, సాయి పల్లవి జీవించేశారని.. ముఖ్యంగా చైతూ ఎమోషనల్ సీన్లు కట్టిపడేశాయంటున్నారు ఫ్యాన్స్. ప్రేమకథతో పాటు అందమైన విజువల్స్, ఆకట్టుకునే కథనంతో దర్శకుడు చందూ మొండేటి సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

దేవిశ్రీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విశేషంగా ఆకట్టుకుంది. తండేల్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ మార్చి 14న ఖరారైనట్టు సమాచారం. ముందుగా మార్చి 6న అని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు మార్చి 14న ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

మంచి కథ, అద్బుతమైన నటన, ఎమోషనల్ కంటెంట్‌తో తండేల్ మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకున్న తండేల్ మార్చి 14 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఎక్కువ మంది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories