Naga Chaitanya: చై ఫస్ట్‌ కిస్‌ ఎప్పుడో తెలుసా.? మరీ అంత చిన్న వయసులోనా..

Naga Chaitanya Reveals His First Kiss Experience Goes Viral on Social Media
x

Naga Chaitanya: చై ఫస్ట్‌ కిస్‌ ఎప్పుడో తెలుసా.? మరీ అంత చిన్న వయసులోనా..

Highlights

Naga Chaitanya: యంగ్ హీరో నాగ చైతన్య తండేల్‌ మూవీ హిట్‌తో జోష్‌లో ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో మత్స్యకారుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Naga Chaitanya: యంగ్ హీరో నాగ చైతన్య తండేల్‌ మూవీ హిట్‌తో జోష్‌లో ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో మత్స్యకారుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ప్రొఫెషనల్ గా ఇలా ముందుకు సాగుతున్న నాగ చైతన్య వ్యక్తిగత జీవితం కూడా మీడియా హైలైట్ అయింది. గతంలో టాప్ హీరోయిన్ సమంతను ప్రేమించి, వివాహం చేసుకున్న చైతూ ఆ తర్వాత అనుకోని విధంగా ఆమెతో విడిపోయాడు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఇద్దరూ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు.

తరువాత నాగ చైతన్య హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శోభిత, చైతన్య ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల రానా నిర్వహించిన ఓ టాక్ షోలో నాగ చైతన్య అతిథిగా పాల్గొన్న చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? ఎవరికి ఇచ్చావు?” అనే ప్రశ్నకు స్పందిస్తూ, తొమ్మిదో తరగతిలోనే ఒక అమ్మాయికి తన మొదటి ముద్దు ఇచ్చానని, ఆ అనుభవం తనకు గుర్తుండిపోయిందని చెప్పాడు. “ఆ ముద్దు నా జీవితాంతం గుర్తుండిపోతుంది” అని చెప్పుకొచ్చా చై.

ఇక అలాగే.. ఒక అభిమాని తన దగ్గరకు వచ్చి “మీరు సమంత కంటే ఎక్కువ తెల్లగా ఉన్నారు” అని అన్న సంఘటనను కూడా నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు. చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories