Naga Chaitanya: శోభిత సూపర్.. సతీమణిపై ప్రశంసలు కురిపించిన హీరో నాగచైతన్య

Naga Chaitanya Praises His Wife Sobhita
x

శోభిత సూపర్.. సతీమణిపై ప్రశంసలు కురిపించిన హీరో నాగచైతన్య

Highlights

హీరో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాళ్లపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చైతన్య.. శోభితతో తాను అన్ని విషయాలు ఎంతో ఆనందంగా పంచుకుంటానని అన్నారు.

Naga Chaitanya: హీరో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాళ్లపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చైతన్య.. శోభితతో తాను అన్ని విషయాలు ఎంతో ఆనందంగా పంచుకుంటానని అన్నారు. కీలక విషయాల్లో అయోమయానికి లోనైన సమయంలో తాను ఎంతో సపోర్టుగా ఉంటుందని.. సరైన సూచనలు ఇస్తుందంటూ తన జీవిత భాగస్వామి గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

శోభితతో జీవితాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు నాగచైతన్య. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం ఇష్టమని చెప్పారు. తాను ఎప్పుడైన గందరగోళానికి గురైనప్పుడు వెంటనే ఆమెను సంప్రదిస్తానన్నారు. తాను ఏ కొంచెం ఒత్తిడికి లోనైనా తనకు తెలిసిపోతుందని.. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారని అడుగుతుందన్నారు. ప్రతి విషయంలో శోభిత తనకు సలహాలు, సూచనలు ఇస్తుంటుందని చెప్పారు. ఆమె అభిప్రాయాలు పర్ఫెక్ట్‌గా ఉంటాయని ప్రశంసించారు. శోభిత నిర్ణయాలను, అభిప్రాయాలను తాను ఎంతో గౌరవిస్తానన్నారు. తన విషయంలో ప్రతిదీ ఆమె నిర్ణయం తర్వాతే కార్యరూపం దాలుస్తుందని నాగచైతన్య చెప్పారు.

నాగచైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ, పెళ్లి గురించి ఇటీవల వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ శోభిత పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ మూవీలో నాగచైతన్య జాలరి‌గా కనిపించనున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వస్తున్న ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ, సాయిపల్లవి కాంబోలో ఇది రెండో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories