బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మళ్లీ అక్కినేని హీరో..?

Naga Chaitanya Going to Do Movie with Bommarillu Bhaskar | Live News
x

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మళ్లీ అక్కినేని హీరో..?

Highlights

Bommarillu Bhaskar: "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్...

Bommarillu Bhaskar: లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సూపర్ హిట్ సినిమాలతో యువ హీరో నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ లను అందుకుంటున్నారు. ఇక అమీర్ ఖాన్ హీరోగా నటించిన "లాల్ సింగ్ చద్దా" సినిమాతో ఏకంగా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్న నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" అనే సినిమాలో నటిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటోంది.

నాగచైతన్య అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ్ బైలింగ్వల్ సినిమా ఒకటి చేయబోతున్నారు. అలాగే ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న "దూత" అనే ఒక వెబ్ సిరీస్ తో ఓటీటీలో కూడా అడుగుపెట్టబోతున్నాడు నాగచైతన్య. అయితే తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ నాగచైతన్య కు కథ వినిపించగా నాగచైతన్య కూడా ఓకే చెప్పారట. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అయితే ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories