టైటిల్ ఇదే.. మరి ఎందుకు దాస్తున్నట్టు?

టైటిల్ ఇదే.. మరి ఎందుకు దాస్తున్నట్టు?
x
నాగచైతన్య, శేఖర్ కమ్ముల
Highlights

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్ట వార్తలు వచ్చాయి. ఇదే టైటిల్ ని చిత్ర నిర్మాతలు ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టు వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా నాగచైతన్య ఈ టైటిల్ పై స్పందించాడు. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేయలేదని, కేవలం వర్కింగ్ టైటిల్ గానే వాడుకుంటున్నామని, ప్రస్తుతం సినిమా 40 శాతం కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి లవ్ స్టొరీ అని టైటిల్ ని శేఖర్ కమ్ముల ఎప్పుడో ఫిక్స్ అయ్యాడట. కానీ బయటకు మాత్రం చెప్పడం లేదు.. అయితే తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి పండగ సందర్భంగా సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా అప్పుడే రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం.

ప్రస్తుతం నాగచైతన్య వెంకీమామ సినిమాతో రేపు ( శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వెంకటేష్ మరో హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించాగా, సురేష్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించింది. తమన్ సంగీతం అందించాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories