"శ్యామ్ సింగరాయి" డైరెక్టర్ తో చేతులు కలపనున్న నాగ చైతన్య

Naga Chaitanya Film With Director Rahul Sankrityan | Telugu Movie News
x

"శ్యామ్ సింగరాయి" డైరెక్టర్ తో చేతులు కలపనున్న నాగ చైతన్య

Highlights

టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో "శ్యామ్ సింగరాయి" డైరెక్టర్

Naga Chaitanya-Rahul Sankrityan: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "టాక్సీవాలా" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. ఈ మధ్యనే న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "శ్యామ్ సింగరాయి" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక రాహుల్ సాంకృత్యాయన్ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ తదుపరి సినిమాలో యువహీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా కోసం రాహుల్ సాంకృత్యాయన్ ఒక టైమ్ ట్రావెల్ కథ ని ఎంపిక చేసినట్లు ప్రస్తుతం ఈ కథకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. భిన్నమైన కథ అయినప్పటికీ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే గల సత్తా తనలో ఉందని ఇప్పటికే తన రెండు సినిమాలతో బాగానే నిరూపించాడు రాహుల్. పైగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెలుగులో చాలా కొన్ని సినిమాలు మాత్రమే వచ్చాయి. అందులోనూ ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ సాంకృత్యాయన్ సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories