జార్జిరెడ్డి ఐడియాలజీ పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తుంది : నాగబాబు

george reddy
x
george reddy
Highlights

ఓయూలో 1969 కాలంలో విప్లవ పంథాను నడిపిన జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతుంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రంలో సందీప్ మాధవ్,...

ఓయూలో 1969 కాలంలో విప్లవ పంథాను నడిపిన జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతుంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రంలో సందీప్ మాధవ్, సత్యదేవ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్ 15న ప్రి రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. జార్జిరెడ్డి బయోపిక్ చిత్రాల్లో ఓ ట్రెండ్ సృష్టిస్తుందని తెలిపారు. తాను కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్నివ్యక్తిగత యూట్యూబ్ చానల్ లో ఓ వీడియోను పోస్టు చేశాడు. జార్జీరెడ్డి ఓ గొప్ప విద్యార్థని, అంతకంటే గొప్ప వీరుడని కొనియాడారు. జార్జీరెడ్డి బ్రతికి ఉంటే సీఎం,పీఎం అయ్యేవాడని పేర్కొన్నారు. మొదట జార్జీరెడ్డి పాత్ర పవన్‌తో, వరుణ‌్‌తోనో చేయించాలని అనుకున్నానని తెలిపారు.

చదవులోనూ జార్జిరెడ్డి చదువులో గొప్పగా రాణించేవాడని, విద్యార్థుల సమస్యల కోసం ఆ రోజుల్లోనే ఇస్రోలో ఉద్యోగం వస్తే వదిలేశాడు. సమాజంలో ఉండి, సమస్యలపై పోరాడాడు. జార్జిరెడ్డి క్యారెక్టర్, అగ్రెసివ్‌నెస్, ఎమోషన్స్ పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తాయని తెలిపారు. జార్జిరెడ్డి స్ఫూర్తి పవన్ కళ్యాణ్‌తో ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నానని నాగబాబు యూట్యూబ్ లో తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories