వరుణ్ తేజ్ సినిమాకి నిర్మాతగా మారనున్న మెగాబ్రదర్

Naga Babu is the Producer of Varun Tej Movie | Tollywood News
x

వరుణ్ తేజ్ సినిమాకి నిర్మాతగా మారనున్న మెగాబ్రదర్

Highlights

*వరుణ్ తేజ్ సినిమాకి నిర్మాతగా మారనున్న మెగాబ్రదర్

Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు ఒక నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా అందరికీ సుపరిచితుడే. గతంలో నాగబాబు నిర్మాతగా రుద్రవీణ, ముగ్గురు మొనగాళ్లు, త్రినేత్రుడు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, స్టాలిన్ మరియు ఆరెంజ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు మళ్లీ నిర్మాణం వైపు చూడలేదు. ఆ సినిమా నాగబాబు కి అందించిన నష్టాలు అంతా ఇంతా కాదు. ఆరెంజ్ సినిమా వల్ల వచ్చిన నష్టాలకి ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నాను కానీ ఆ సమయంలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ తనికి సపోర్ట్ గా నిలిచారని నాగబాబు ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఆరెంజ్ అయిపోయిన చాలా కాలం తర్వాత మళ్లీ అల్లు అర్జున్ హీరోగా నటించిన "నా పేరు సూర్య" సినిమాని నిర్మించారు నాగబాబు. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం నాగబాబు ఇప్పుడు మళ్లీ ఒక నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాగబాబు కూడా కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలిపారు వరుణ్ తేజ్. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు అమెరికాలోనే జరుగుతుందట. మరి తన కొడుకు సినిమాతో అయినా నాగబాబు నిర్మాతగా హిట్ అందుకుంటారా లేదా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories