U&I Retail Store: విజయవాడలో గ్రాండ్‌గా ఆరంగేట్రం.. ఆకట్టుకున్న నభా నటేష్

U&I Retail Store: విజయవాడలో గ్రాండ్‌గా ఆరంగేట్రం.. ఆకట్టుకున్న నభా నటేష్
x

U&I Retail Store: విజయవాడలో గ్రాండ్‌గా ఆరంగేట్రం.. ఆకట్టుకున్న నభా నటేష్

Highlights

టాలీవుడ్‌ హీరోయిన్‌ నభా నటేష్ తాజాగా విజయవాడలో మెరిసారు. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ U&I తన తొలి ప్రత్యేక రిటైల్ స్టోర్‌ను విజయవాడలోని ఎన్‌.టి.ఆర్‌ కాంప్లెక్స్‌, గవర్నర్‌పేట్‌లో ప్రారంభించింది.

టాలీవుడ్‌ హీరోయిన్‌ నభా నటేష్ తాజాగా విజయవాడలో మెరిసారు. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ U&I తన తొలి ప్రత్యేక రిటైల్ స్టోర్‌ను విజయవాడలోని ఎన్‌.టి.ఆర్‌ కాంప్లెక్స్‌, గవర్నర్‌పేట్‌లో ప్రారంభించింది. ఈ స్టోర్‌ ప్రారంభోత్సవానికి నభా నటేష్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ పరేష్‌ విజ్‌తో పాటు రిటైల్ భాగస్వాములు జస్వంత్ మాలి, ప్రకాశ్ మాలి తదితరులు పాల్గొన్నారు.

తొలి ప్రత్యేక స్టోర్‌

దేశవ్యాప్తంగా ఇప్పటికే 150కి పైగా ప్రత్యేక స్టోర్లను నడుపుతున్న U&I, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కస్టమర్లకు కూడా తన విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఆడియో పరికరాలు, మొబైల్ యాక్సెసరీస్‌, బ్యాటరీలు, లైఫ్‌స్టైల్‌ గాడ్జెట్స్‌ ఇలా బ్రాండ్‌ బెస్ట్‌సెల్లింగ్‌ ప్రోడక్ట్స్‌ అన్నీ ఒకే వేదికలో లభ్యమవుతాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ పరేష్‌ విజ్ మాట్లాడుతూ.. “మా మొదటి ప్రత్యేక స్టోర్‌ను విజయవాడలో ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది మా రిటైల్ విస్తరణ ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఇక్కడి కస్టమర్లు మా బ్రాండ్‌ను ఆదరిస్తారని నమ్ముతున్నాం” అని తెలిపారు.

వినూత్నత, నాణ్యతే ప్రత్యేకత

2019లో స్థాపించబడిన U&I, చాలా తక్కువ సమయంలోనే లైఫ్‌స్టైల్‌ టెక్నాలజీలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగింది. అధిక నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్‌, ఆవిష్కరణలతో రూపొందించిన ఈ ఉత్పత్తులు కేవలం పనికివచ్చేవి మాత్రమే కాకుండా, కస్టమర్ల జీవనశైలికి అనుగుణంగా ఉంటాయి. ఆధునిక అనుభవాన్ని అందించడంలో U&I ప్రత్యేకంగా నిలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories