Actress: గ్యాప్ రావడానికి అసలు కారణం ఇదే.. నటి నభా నటేష్‌

Actress: గ్యాప్ రావడానికి అసలు కారణం ఇదే.. నటి నభా నటేష్‌
x
Highlights

Nabha Natesh: 2018లో వచ్చిన నన్ను దోచుకుందవటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార నభా నటేష్‌.

Nabha Natesh: 2018లో వచ్చిన నన్ను దోచుకుందవటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార నభా నటేష్‌. తొలి మూవీలోనే తనదైన నటన, అందంతో కుర్రకారును ఆకట్టుకుందీ చిన్నది. ఆ తర్వాత వచ్చిన ఈ స్మార్ట్ శంకర్‌తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం, ఇందులో నభాకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

అవకాశాలు అయితే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయిందీ చిన్నది. డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్‌, అల్లుడు అదుర్స్‌ వంటి వరుస అవకాశాలు వచ్చినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక చివరిగా 2024లో వచ్చి డార్లింగ్ మూవీ సైతం డిజాస్టర్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నభా చాలా రోజులు సినిమాల్లో నటిచంలేదు.

దీనికి కారణం ఈ బ్యూటీకి యాక్సిడెంట్ కావడమే. ఏడాది క్రితం జరిగిన ప్రమాదం కారణంగా చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రమాదం కారణంగా పలు సర్జరీలు కూడా జరిగాయి. దాంతో ఓ ఏడాదిపాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నభా ఆరోగ్యంగా కుదుటుపడింది. తాజాగా నిఖిల్‌తో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి పలు విషయాలను పంచుకుందీ బ్యూటీ. యాక్సిడెంట్‌ తర్వాత, తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా శ్రమించానని తెలిపింది. ఆ క్షణంలోమానసికంగా ఎంతో బాధ అనుభవించానని, ఫిట్‌నెస్‌ కోసం శ్రమించానని తెలిపింది. అయితే ఇప్పుడు తన శరీరంపై తనకు అవగాహన పెరిగిందని, మొబిలిటీ ఎక్సర్సైజ్‌లు, స్విమ్మింగ్‌, డ్యాన్సింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది. మరి స్వయంభూ ఈ బ్యూటీ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories