logo
సినిమా

Naatu Naatu Full Song: పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టుగా చెర్రీ, ఎన్టీఆర్ నాటు సాంగ్

Naatu Naatu Full Song Released From RRR Movie Today 10 11 2021
X

Naatu Naatu Full Song: పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు చెర్రీ, ఎన్టీఆర్ నాటు సాంగ్

Highlights

* నాటు నాటు ఫుల్ సాంగ్ విడుదల చేసిన "ఆర్ఆర్ఆర్" మూవీ మేకర్స్

Naatu Naatu Full Song: రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" (RRR) చిత్రం నుండి తాజాగా రెండో సింగిల్ ఫుల్ సాంగ్ విడుదలైంది. నా పాట సూడు..నా పాట సూడు..నాటు నాటు..వీర నాటు..ఊర నాటు అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎంఎం కీరవాణి తన సంగీతాన్ని సమకూర్చగా చంద్రబోసు లిరిక్స్ అందించాడు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఆలపించారు.

ఈ పాటని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో ఫుల్ సాంగ్ ని నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు అలియా భట్, శ్రియ శరన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ మాస్ డాన్స్ తో అభిమానులను ఆకట్టుకున్నారు.


Web TitleNaatu Naatu Full Song Released From RRR Movie Today 10 11 2021
Next Story