బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాల విషయంలో డైలమాలో ఉన్న నిర్మాతలు

Mythri Movie Makers are Confused about Balakrishna And Chiranjeevi Movies
x

బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాల విషయంలో డైలమాలో ఉన్న నిర్మాతలు

Highlights

బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాల విషయంలో డైలమాలో ఉన్న నిర్మాతలు

Mythri Movie Makers: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. నవీన్ ఎర్నేని మరియు వై రవిశంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న మైత్రి మూవీ మేకర్ ఇప్పటికే బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలను చాలా తక్కువ సమయంలోనే అందించింది. చాలా వరకు స్టార్ హీరోలు కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేశారు. తాజాగా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" మరియు గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న #ఎన్బికె107 సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కానీ ఈ ఇద్దరు హీరోల సినిమాల వల్ల ఇప్పుడు మూవీ మేకర్స్ కి పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. దానికి కారణం ఇద్దరు సీనియర్ హీరోలు 2023 సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని అనుకోవడం. చిరంజీవి మరియు బాలకృష్ణ ల మధ్య ఎప్పటినుంచో హెల్తి కాంపిటీషన్ ఉంది.

వీరి సినిమాల మధ్య క్లాష్ అభిమానులకి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ప్రభాస్ నటిస్తున్న "ఆది పురుష్" సినిమా కూడా సంక్రాంతి ఈ సందర్భంగానే విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సమయంలో సీనియర్ హీరోల సినిమాలు విడుదలవడం సీనియర్ హీరో సినిమాల డిస్ట్రిబ్యూటర్లకు అంత మంచిది కాదు. ఎంత సంక్రాంతి సినిమా సీజన్ అయినప్పటికీ ప్రభాస్ సినిమాతో క్లాష్ అవడం ఈ రెండు సినిమాలకి అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు అని మైత్రి మూవీ మేకర్స్ వారు తర్జనభజన అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories