Thaman: ఎవరికి వారే ఎదగాలి అంటున్న థమన్

* నేపోటిజం విషయంలో థమన్ రియాక్షన్

admin1
Updated on: 30 Nov 2021 4:31 PM IST
Music Director Thaman Comments on Nepotism in Film Industry
X

థమన్ (ఫైల్ ఫోటో)

Thaman: ఈ మధ్యకాలంలో హీరోలు మాత్రమే కాక టెక్నీషియన్ లు కూడా తమ కుటుంబ సభ్యులను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. కానీ వీరిలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ మాత్రం ఒకరు కాదు. తన కుటుంబ సభ్యులు అయినా సరే ఎవరి సపోర్టు లేకుండా వారికి వారే ఇండస్ట్రీలో నెగ్గుకురావాలి అని అభిప్రాయ పడుతున్నారట. థమన్ భార్య కూడా ఒక ప్రముఖ సింగర్ కానీ థమన్ ఆమెతో పాడించిన పాటలు చాలా తక్కువనే చెప్పాలి. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తమన్ తన భార్య తన కోసం ఐదు లేదా ఆరు పాత పాటలు మాత్రమే పాడిందని అన్నారు.

ఎవరి అవకాశాలు వారే తెచ్చుకోవాలని థమన్ అభిప్రాయమట. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న థమన్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంతకు ముందు తన కొడుకుకి క్రికెట్ అంటే ఇష్టం అని ఇప్పుడు మ్యూజిక్ అంటున్నాడని కానీ సడన్ గా నాసా లోకి వెళతానని చెప్తాడని మురిసిపోతున్నారు థమన్. ఈ మధ్యనే తన చెల్లెలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని కానీ ఆమెకి సింగర్ అవ్వాలని ఉండేదని, కానీ తనకి ఛాన్స్ ఇవ్వాలని లేదని, తను కెరియర్ లో ఎదగాలంటే తన కోసం తనే కష్టపడాలి అని అంటున్నారు థమన్.

admin1

admin1

Next Story