ప్రముఖ నిర్మాణ సంస్థ తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్

Music Director Devi Sri Prasad With T-Series Owner Bhushan Kumar
x

ప్రముఖ నిర్మాణ సంస్థ తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్

Highlights

Devi Sri Prasad: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిషియన్ లలో థమన్, మిక్కీ జే మేయర్, దేవి శ్రీ ప్రసాద్ ల పేర్లు ముందుంటాయి.

Devi Sri Prasad: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిషియన్ లలో థమన్, మిక్కీ జే మేయర్, దేవి శ్రీ ప్రసాద్ ల పేర్లు ముందుంటాయి. ఈసారి సక్సెస్ ఫుల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ పేరు ముందు ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉండగా దేవిశ్రీప్రసాద్ ఆ స్థానాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. "పుష్ప" సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ కి ఉన్న క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. పుష్ప సినిమాలోని దాదాపు అన్ని పాటలు యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియోస్ చార్ట్ లోని టాప్ హండ్రెడ్ లో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే దేవిశ్రీప్రసాద్ కు బాలీవుడ్ నుంచి సైతం ఆఫర్లు కదిలి వస్తున్నాయి.

తాజాగా దేవిశ్రీప్రసాద్ టి సిరీస్ నిర్మాణ సంస్థ హెడ్ అయిన భూషణ్ కుమార్ ని కలవడం జరిగింది. భారత దేశంలోని చాలామంది బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ ల తో చేతులు కలిపి భూషణ్ కుమార్ ఇప్పటికే కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే భూషణ్ కుమార్ ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ కలిసి ఒక పెద్ద ప్రాజెక్టు కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాలీవుడ్లో కేవలం నేపథ్య సంగీతానికి లేక కొన్ని పాటలకు మాత్రమే సంగీతాన్ని అడుగుతున్నారు అని అందుకే తాను హిందీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories