logo
సినిమా

టాలీవుడ్ లో విషాదం.. నటుడు కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం.. నటుడు కన్నుమూత
X
Highlights

టాలీవుడ్ సినీఇండస్ట్రీలో విషాదం నెలకొంది, ప్రముఖ రంగస్థల, సినీ నటుడు డీఎస్‌ దీక్షితులు మృతిచెందారు. గతకొంత...

టాలీవుడ్ సినీఇండస్ట్రీలో విషాదం నెలకొంది, ప్రముఖ రంగస్థల, సినీ నటుడు డీఎస్‌ దీక్షితులు మృతిచెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఓ సీరియల్ చిత్రీకరణలో ఉండగా..హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే దీక్షితులు మృతిచెందినట్టు వైద్యులు దృవీకరించారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు.

దీక్షితులు స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. దీక్షితులు తెలుగు, సంస్కృత భాషల్లో రంగస్థల కళల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చారు. మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి చిత్రం ద్వారా దీక్షితులు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఇంద్ర, ఠాగూర్‌, అతడు, వర్షం సినిమాల్లో నటించి మెప్పించారు.

Next Story