ముంబైలో ఆ హీరోతో తలపడ్డ నాని

Nani
x
Nani
Highlights

ఓ కొత్త తరహా కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

గ్యాంగ్ లీడర్ సినిమాతో ఈసారి ప్రేక్షకులను నిరాశపరిచిన నాని ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నాడు. ఓ కొత్త తరహా కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో నాని ఓ కిల్లర్ రోల్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు.

తాజాగా సుధీర్ బాబు, నానిలకి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ ని ముంబైలో చిత్రీకరించారు. ఈ విషయాన్నీ సుధీర్ బాబు తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వచ్చే ఏడాది ఉగాదికి సినిమా విడుదల కానుంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories