MS Dhoni: ఐపీఎల్ 2021కి నిజమైన విజేత కలకత్తా నైట్ రైడర్స్

Sandeep Reddy
Published on: 16 Oct 2021 4:51 PM IST
MS Dhoni Says Kolkata Knight Riders is The Real Winners of IPL 2021
X

మహేంద్ర సింగ్ ధోని (ట్విట్టర్ ఫోటో)

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శుక్రవారం కలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన తరువాత మీడియా ముఖంగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ తాము గెలిచినా నిజమైన విజేత మాత్రం కలకత్తా నైట్ రైడర్స్ అని, మొదటి దశ ఐపీఎల్ లో అంతగా రాణించని కలకత్తా యూఏఈలో జరిగిన రెండో దశలో అద్భుతంగా రాణించిందని, ప్లేఆఫ్ లో చోటు సాధించడమే కాకుండా వరుస క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్స్ కి చేరడం గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది ఐపీఎల్ 2021 టైటిల్ గెలవడానికి ఏ జట్టుకు అయిన అర్హత ఉందని అనుకుంటే అది తప్పకుండా కలకత్తా నైట్ రైడర్స్ జట్టే అని తాను భావిస్తున్నట్లు ధోని తెలిపాడు. ఇక ఈ సీజన్ లో తమ ఆటగాళ్ళ ప్రదర్శన బాగుందని, కొన్ని కారణాల వల్లే మ్యాచ్ మ్యాచ్ కి ఆటగాళ్ళను మార్చడం జరిగిందని జట్టులో సమిష్టిగా రాణించడం వలనే టైటిల్ ని గెలిచామన్నాడు. ఇప్పటివరకు ఎక్కువసార్లు ఫైనల్ లో ఓడిన జట్టు తమదేనని ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ గెలువాలనుకున్నామని తెలిపాడు. మ్యాచ్ ఎక్కడైనా ఎలాంటి సమయంలోనైనా చెన్నై అభిమానులు తమ వెంటే ఉండటం, వాళ్ళ సపోర్ట్ ఎల్లవేళలా ఉండటం చాలా సంతోషంగా ఉందని ధోని చెప్పుకొచ్చాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story