మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు

Movies Set to Release in March | Tollywood News
x

మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు

Highlights

మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు

Movie News: కరోనా కారణంగా దాదాపు చాలా సినిమాల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు దాదాపు అన్ని సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక తాజాగా అప్పుడు వాయిదా పడ్డ సినిమాలన్నీ ఇప్పుడు మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మొదటిది ఈటీ. ఈ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్ సూర్య సినిమా థియేటర్ లో విడుదలై చాలా కాలం అయింది. తాజాగా పాండి రాజు డైరెక్షన్లో సూర్య హీరోగా చేసిన ఒక ప్యాన్ ఇండియన్ సినిమా ఈటీ. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 10వ తేదీన విడుదల కాబోతోంది.

మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్" సినిమా కూడా మార్చి 11 న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. విధి తో పోరాటం చేసే ఒక ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ రెండు పెద్ద సినిమాలు మాత్రమే కాక అటువైపు ఓటీటీలలో కూడా మార్చి 10, 11 వ తేదీలలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవేంటో కూడా చూసేయండి.

హాట్‌స్టార్‌:

* ఖిలాడి - మార్చి 11

* సమారన్‌ - మార్చి 11

ఆహా:

* ఖుబూల్‌ హై - మార్చి 11

సోనీలివ్‌:

*క్లాప్‌ - మార్చి 11

జీ5:

*రౌడీ బాయ్స్‌ - మార్చి 11

*మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ షమీమ్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 11

*రైడర్‌ - మార్చి 11

నెట్‌ఫ్లిక్స్‌:

*అవుట్‌ ల్యాండర్‌ (ఆరో సీజన్‌) - మార్చి 7

*ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ (ఐదో సీజన్‌) - మార్చి 9

*ద అండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 9

*ఎ ఆడమ్‌ ప్రాజెక్ట్‌ - మార్చి 11

అమెజాన్‌ ప్రైమ్‌:

*అప్‌లోడ్‌ (రెండో సీజన్‌) - మార్చి 11

ఎంఎక్స్‌ ప్లేయర్‌:

*అనామిక - మార్చి 10

Show Full Article
Print Article
Next Story
More Stories