"భీమ్లా నాయక్" లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నటి

"భీమ్లా నాయక్" లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నటి
"భీమ్లా నాయక్" లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నటి
Mounika Reddy: మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ మధ్యనే ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన "భీమ్లా నాయక్". విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ ని అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే స్టార్ కాస్ట్ తర్వాత ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన నటి మౌనిక రెడ్డి. వైజాగ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న మౌనిక రెడ్డి నటనపై ఆసక్తితో వెబ్ సిరీస్ లో నటించడం మొదలు పెట్టింది. సూర్య వెబ్ సిరీస్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న మౌనిక రెడ్డి ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది.
సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే పాత్ర తనది. మొదటి సినిమాలోనే ఇంత మంచి పాత్ర దొరకడం నిజంగా మౌనిక రెడ్డి అదృష్టమనే చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు తను చాలా భయపడ్డానని ఆ విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ స్వయంగా ముందుకు వచ్చి తనతో మాట్లాడారని చెప్పుకొచ్చింది. మౌనిక ఇక ఈ మధ్య వెండితెర అవకాశాలు బాగానే వస్తున్నాయని, ఆహా సోనీ లివ్ వంటి ఓటీటీ లలో కూడా పని చేస్తున్నట్లుగా తెలిపిన మౌనిక త్వరలోనే నిఖిల్ హీరోగా నటిస్తున్న "18 పేజస్", విశ్వక్ సేన్ నటిస్తున్న "ఓరి దేవుడా", మరియు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న "కథ" సినిమాలతో కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT
Narendra Modi: కేసీఆర్ పేరు ఎత్తకుండా సాగిన మోడీ ప్రసంగం
3 July 2022 3:30 PM GMTకేసీఆర్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా
3 July 2022 3:00 PM GMTNarendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMT