నేను పెళ్లి చేసుకోబోయేవాడు నా షూ తో సమానం..పండగ పూట షాకిచ్చిన పూజా హెగ్డే!

నేను పెళ్లి చేసుకోబోయేవాడు నా షూ తో సమానం..పండగ పూట షాకిచ్చిన పూజా హెగ్డే!
x
Highlights

Most Eligible Bachelor Teaser: పూజా హెగ్డే షూ చేత్తో పట్టుకుని నాకు కాబోయేవాడు దీనితో సమానం అంటోంది అక్కినేని అఖిల్ తొ.. ఎందుకో మరి..

అక్కినేని అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మళ్ళీ టాలీవుడ్ ను పలకరిస్తున్నారు. పూజ హేగ్దేతో జోడీ కట్టి మరో ప్రేమకథ తొ ప్రేక్షకులను ఈ సంక్రాంతికి పలకరించనున్నాడు. సంక్రాంతికి తెరమీదకు రానున్న ఈ బ్యాచిలర్ దసరాకి టీజర్ తొ ప్రేక్షకులను పలకరించాడు.

మీ మేరీడ్ లైఫ్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అని ఎవరినో అడుగుతూ మొదలెట్టారు అఖిల్. కేరింగ్ హజ్బండ్ అంది అవతలి అమ్మాయి. అన్ని పనులు షేర్ చేసుకోవాలి.. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ..ఇలా వచ్చాయి అఖిల్ కు సమాధానాలు. అంత సాఫ్ట్ నచ్చలేదనుకుంటా కొంచెం వైల్డ్ గా ట్రై చేయి అని అడిగాడు అఖిల్. ఇంకేముంది పూజా హెగ్డే రెండు చేతులతోనూ షూ పట్టుకుని నాకు కాబోయేవాడు నా షూ లతో సమానం అంటూ ఎంట్రీ ఇచ్చింది.

ఈ డైలాగులు చాలు సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడానికి. అవును బొమ్మరిల్లు భాస్కర్ మళ్ళీ ఓ హాసిని లాంటి క్యారెక్టర్ పట్టుకుని వచ్చేస్తున్నాడు అనిపిస్తోంది కదూ.. టీజర్ చూసిన వాళ్ళంతా అలానే ఫీల్ అవుతున్నారు. మొత్తమ్మీద టీజర్ లో అఖిల్ స్మార్ట్ లుక్ లో అదర గొట్టేస్తే.. పూజా హెగ్డే తన గ్లామరస్ యాక్టింగ్ తొ కేక పుట్టించింది. ఇంతకీ ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఈ సంక్రాంతికైనా పెళ్లి చేసుకుంటాడా.. చూడాల్సిందే. అల్లు అరవింద్ సమర్పణలో.. గీతా ఆర్ట్స్ పతాకం పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.Show Full Article
Print Article
Next Story
More Stories