Adipurush: రాములోరి సినిమాకు విచ్చేసిన హనుమంతుడు.. వీడియో వైరల్..

Adipurush: ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.

Arun Chilukuri
Published on: 16 Jun 2023 11:51 AM IST
Monkey Visits Prabhas Adipurush Theatre
X

Adipurush: రాములోరి సినిమాకు విచ్చేసిన హనుమంతుడు.. వీడియో వైరల్..

Adipurush: ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. సినిమాను వీక్షించేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ థియేటర్లో జరిగిన సంఘటన అందరినీ ఆకట్టుకుంటుంది. 'ఆదిపురుష్‌' థియేటర్లో అనుకోని అతిథి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆదిపురుష్ సినిమా ప్రదర్శన్ జరుగుతున్న థియేటర్ కు కోతి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హనుమంతుడు రాముడి సినిమాకు వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. దీంతో హాలంతా ఒక్కసారిగా 'జై శ్రీరామ్‌' అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చూసినవారంతా అద్భుతమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story