అవినాష్‌కు మరోసారి సారీ చెప్పిన మోనాల్

అవినాష్‌కు మరోసారి సారీ చెప్పిన మోనాల్
x
Highlights

వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా కటకటాలకు వెళ్లిన అభి జైలు శిక్ష పూర్తయింది. అలాగే లగ్జరీ బడ్జెట్‌ టాస్కులో భాగంగా అభి స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర గాయాలపాలయ్యాడు. ఇక అరియానా సరదాగా మాట్లాడినదానికి అవినాష్‌ సీరియస్‌ అయ్యాడు.

వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా కటకటాలకు వెళ్లిన అభి జైలు శిక్ష పూర్తయింది. అలాగే లగ్జరీ బడ్జెట్‌ టాస్కులో భాగంగా అభి స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర గాయాలపాలయ్యాడు. ఇక అరియానా సరదాగా మాట్లాడినదానికి అవినాష్‌ సీరియస్‌ అయ్యాడు.

ఉన్నదున్నట్లు చెప్పే అరియానా అఖిల్‌ బండారం మొత్తం బయటపెట్టింది. అఖిల్‌ తనను పెళ్లి చేసుకుంటా అన్నట్లుగా మాట్లాడాడని మోనాల్, సోహౌలతో చెప్పింది. బయటకు వెళ్లాక టచ్‌లో ఉందామని చెప్పాడని అఖిల్‌ గుట్టు విప్పింది. అటు అభిజిత్‌ జైలు శిక్ష కాలం ముగిసింది. దీంతో బిగ్‌బాస్‌ సూచనల మేరకు హౌస్‌మేట్స్‌.. అభిజిత్‌ను జైలు నుండి విడుదల చేశారు.

ఇంట్లో లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ జరిగింది. ఇందులో అభిజిత్‌ కళ్లకు గంతలు కట్టుకోగా అఖిల్‌ అతడికి దారి చెప్తూ కింద ఉన్న ఐటెమ్స్‌ తీసుకునేందుకు సహకరించాడు. ఈ క్రమంలో ఓ చోట అభి స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర దెబ్బలు తగిలించుకున్నాడు. అరియానా సరదాగా మాట్లాడినదానికి అవినాష్‌ సీరియస్‌ అయ్యాడు. చిన్నచిన్నవాటికే పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడని ఆమె తల బాదుకుంది.

నాగార్జున కనిపించగానే కంటెస్టెంట్లు మనసులోని బాధనంతా బయటకు కక్కారు. వారం రోజులుగా చర్చనీయాంశమైన మోనాల్‌, అవినాష్‌ పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. మోనాల్‌ నిజంగానే తన్నిందని నాగ్‌ వీడియోతో సహా బయటపెట్టడంతో ఆమె దోషిగా తలదించుకుని అవినాష్‌కు సారీ చెప్పింది.

నాగార్జున కనిపించగానే కంటెస్టెంట్లు మనసులోని బాధనంతా బయటకు కక్కారు. ఆవు-అంబా టాస్కులో మోనాల్‌ తనను కావాలని తన్నిందని అవినాష్‌ చెప్పాడు. దీంతో నాగ్‌ వీడియో చూపించి అందరి అభిప్రాయాలను తెలుసుకున్నాడు. మోనాల్‌ కావాలని తన్నిందని అఖిల్‌ తప్ప మిగతా అందరూ ఒప్పుకున్నారు. దీంతో తన తప్పు తెలుసుకున్న మోనాల్‌.. అవినాష్‌ను మరోసారి క్షమాపణలు కోరింది.

మూడు వారాలుగా తోటిసభ‌్యులు వీకె అంటున్నారని తన బాధ నాగ్‌తో చెప్పుకుంది మోనాల్‌. ఇక తన్నడం గురించి కూడా ఆమె తన వివరణ ఇచ్చుకుంటుండగా.. క్యాన్‌ తన్నే క్రమంలో అవినాష్‌ను తన్నావు అంతే.. అంటూ నాగ్‌ ఆమెను ఓదార్చారు.సోహైల్‌ త్యాగం వల్లే అఖిల్‌ గెలిచాడన్నది ప్రేక్షకులకు తెలుసని నాగ్‌ చెప్పారు. తర్వాత అఖిల్‌ సేవ్‌ అయ్యి ఫస్ట్‌ ఫైనలిస్టుగా నిలిచాడని నాగ్‌ వెల్లడించారు. అనంతరం సోహైల్‌ చేతుల మీదుగా అఖిల్‌ ఫినాలే మెడల్‌ వేయించుకున్నాడు.

సోహైల్‌ చేసిన త్యాగం వల్లే అఖిల్‌కు ఫినాలే మెడల్‌ వచ్చిందని నాగ్‌ మరీమరీ నొక్కి చెప్పారు. అటు సోహైల్‌ను ఎమోషనల్‌ ఫూల్‌గా అభివర్ణించారు. ఇక తమను ఆటలో ముందుకు వెళ్లకుండా ఆపుతున్న బంధమేదో చెప్పి స్టిక్‌ విరగొట్టారు ఇంటిసభ్యులు. ఆటలో మిమల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న బంధమేదో చెప్పి స్టిక్‌ విరగ్గొట్టాలని నాగ్‌ ఆదేశించారు. గేమ్‌ మీద ఎఫెక్ట్‌ అయ్యేంత బాండ్‌ ఎవరితోనూ లేదని చెప్ప్తూనే అరియానా.. సోహైల్‌ పేరు చెప్పి స్టిక్‌ విరగ్గొట్టింది.

తనను ఇబ్బంది పెడుతోందంటూ అభిజిత్‌.. హారిక పేరు చెప్పి స్టిక్‌ ముక్కలు చేశాడు. హారిక.. మోనాల్‌ పేరు చెప్పి స్టిక్‌ ముక్కలు చేసింది. ఇక అవినాష్‌ తనకు అందరూ అడ్డేనంటూ స్టిక్‌ను ఆరు ముక్కలు చేసి అందరికీ పంచాడు.మోనాల్‌ వల్ల గేమ్‌ డిస్టర్బ్‌ అవుతోందని అఖిల్‌ ఆమెతో బంధాన్ని బ్రేక్‌ చేశాడు. ఎవరేడ్చినా తనకే బాధేస్తోందని చెప్పిన సోహైల్‌ను నాగ్‌ ఎమోషనల్‌ ఫైల్‌ అని పిలిచారు. సోహైల్‌ కూడా స్టిక్‌ విరగొట్టి అందరికీ ఆ ముక్కలు పంచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories