Monal Gajjar Special Song : మోనాల్‌ ఐటెమ్‌ సాంగ్‌ .. రెమ్యునరేషన్‌ చూస్తే షాక్

Monal Gajjar Special Song : మోనాల్‌ ఐటెమ్‌ సాంగ్‌ .. రెమ్యునరేషన్‌ చూస్తే షాక్
x
Highlights

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు పెద్దలు. అయితే ఇది అందరికి వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు పెద్దలు. అయితే ఇది అందరికి వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. కానీ సినిమా వాళ్లకు చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఇదీ ఎందుకు అంటారా? హీరోయిన్ మోనాల్ గజ్జర్‌ గురించి చెప్పాల్సి వస్తోంది. బిగ్‌బాస్‌ సీజన్‌4లో హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజీత్‌, రన్నరప్‌ అఖిల్‌తో మోనాల్‌ నడిపిన లవ్‌ట్రాక్‌ ఆమెకు కావాల్సినంత మైలెజ్ తెచ్చిపెట్టింది. ఈ కారణంగానే ఎప్పుడో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రావాల్సిన మోనాల్‌ గజ్జర్ ఫైనల్‌ ముందు వరకు హౌస్‌లోనే కొనసాగింది. చివరకు బిగ్ బాస్ ముగిసింది. దానిలో అందరికి మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇక మోనాల్‌ గజ్జర్‌కు చాలా బాగానే అవకాశాలు వస్తున్నాయట. కాగా.. తాజా సమాచారం మేరకు మోనాల్‌ గజ్జర్‌ ఓ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో నటిస్తుంది. ఆ పాటకు మోనాల్‌ గజ్జర్‌ కోట్‌ చేసిన రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? అక్షరాల 15 లక్షలు.. మోనాల్ గజ్జర్‌ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పారంట. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తోన్న అల్లుడు అదుర్స్ చిత్రం‌. సంతోశ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వ బాథ్యతలు తీసుకున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన మోనాల్‌కు అయితే పెద్ద హీరోయిన్ ఉన్న క్రేజ్ ఉంది కాబట్టి ఆమె అడిగిన 15లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు సిధ్థమైయ్యారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

మొత్తానికి మోనాల్‌ గజ్జర్ బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన క్రేజ్‌ను బాగానే క్యాష్‌ చేసుకుంటుందని ఫిల్మీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న అల్లుడు అదుర్స్‌లో మరోసారి మోనాల్ ను చూసే అవకాశం ఉంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను మోనాల్ బాగానే ఉపయోగించుకుంటుందన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories