రామ్ చరణ్ సినిమాకి నో చెప్పిన మోహన్ లాల్

Mohanlal Rejects Ram Charan Movie | Telugu Movie News
x

రామ్ చరణ్ సినిమాకి నో చెప్పిన మోహన్ లాల్

Highlights

*రామ్ చరణ్ సినిమాకి నో చెప్పిన మోహన్ లాల్

Mohanlal: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఈమధ్యనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది.

స్టార్ కోలీవుడ్ నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా లో ఒక నెగిటివ్ పాత్ర కోసం మలయాళంలో ప్రముఖ నటుడు అయిన మోహన్ లాల్ ను సంప్రదించారు దర్శకనిర్మాతలు. అవినీతికి పాల్పడే ఒక పెద్ద రాజకీయ నాయకుడు పాత్ర అది.

కానీ విలన్ పాత్రలలో నటించకూడదని నిర్ణయించుకున్నా మోహన్ లాల్ ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ పాత్ర కోసం శంకర్ మరొక పెద్ద నటుడి వేటలో పడ్డారు. దిల్ రాజు మరియు శిరీష నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories