బాహుబలి తర్వాత మరో భారీ బడ్జెట్‌ చిత్రం 'మరక్కార్' ట్రైలర్‌ రిలీజ్

బాహుబలి తర్వాత మరో భారీ బడ్జెట్‌  చిత్రం మరక్కార్ ట్రైలర్‌ రిలీజ్
x
మరక్కార్ మూవీ
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మన దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు స్ఫూర్తి అని చెప్పొచ్చు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మన దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు స్ఫూర్తి అని చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాలు ప్రారంభం కావడానికి 'బాహుబలి' నుంచే ప్రారంభమైయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి 'సైరా' కూడా అన్ని భాషల్లో తెరకెక్కింది. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ భారీ బడ్జెట్‌ చిత్రంతో వస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న 'మరక్కార్' కొద్ది రోజుల్లో విడుదల కానుంది. మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 26న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. 'మరక్కార్' 'అరేబియా సముద్ర సింహం' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. అయితే, సినిమా ప్రచారంలో భాగంగా దీనికి సంబంధించిన ట్రైలర్ శుక్రవారం అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగు 'మరక్కార్' ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు. ఇక తమిళ ట్రైలర్‌ను సూర్య విడుదల చేయగా.. కన్నడ ట్రైలర్‌ను యశ్, హిందీలో సినిమా ట్రైలర్‌ను అక్షయ్ కుమార్ విడుదల చేశారు.

కుంజ‌లి మ‌ర‌క్కార్ జీవిత క‌థ ఆధారంగా 16వ శ‌తాబ్దం నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. దాదాపు రూ.100 కోట్లపైగా బ‌డ్జెట్‌తో దీనిని నిర్మించారు. 1996లో వ‌చ్చిన 'కాలాపానీ' సినిమా త‌రువాత‌ ప్రియ‌ద‌ర్శన్‌, మోహ‌న్‌లాల్, ప్రభు కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా, ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. ఇక హీరో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శన్, కీర్తి సురేష్, ఫాజిల్, సిద్ధిఖి, ఇన్నోసెంట్, నేదుముడి వేణు, అశోక్ సెల్వన్ కీలక పాత్రలు పోషించారు. ఆశిర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటొని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రోనీ రాఫెల్ సంగీతం అందించారు. 'బాహుబలి'కి సినిమాకు పనిచేసిన సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ ఈ సినిమాకు పనిచేశారు. తిరు సినిమాటోగ్రఫీ అందించగా.. అయ్యప్పన్ నాయర్ ఎడిటర్. అంకిత్ సూరి, లయెల్ ఎవాన్స్ రోడెర్ (లండన్) రాహుల్ రాజ్, నేపథ్య సంగీతం సమకూర్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories