మహేష్ బాబు సినిమాలో మోహన్ లాల్

Mohanlal In Mahesh Babu Movie
x

మహేష్ బాబు సినిమాలో మోహన్ లాల్

Highlights

Mahesh Babu: సూపర్ స్టార్ సినిమా లో మలయాళం స్టార్ నటుడు.

Mahesh Babu: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "సర్కారు వారి పాట". పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అతడు మరియు ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. మహేష్ బాబు కెరీర్లో 28వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా జోనర్లో తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక మలయాళం స్టార్ నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. ఒక పవర్ఫుల్ పొలిటిషన్ మోహన్లాల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories