Mohan babu vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. మనోజ్ బౌన్సర్లను బయటకు నెట్టేసిన విష్ణు

మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. మనోజ్ బౌన్సర్లను బయటకు నెట్టేసిన విష్ణు
x

మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. మనోజ్ బౌన్సర్లను బయటకు నెట్టేసిన విష్ణు

Highlights

Manchu mohan babu and Manchu manoj controversy: హైద్రాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ అనుచరులు, విష్ణు బౌనర్ల మధ్య గొడవ జరిగింది.

Manchu mohan babu and Manchu manoj controversy: హైద్రాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ అనుచరులు, విష్ణు బౌనర్ల మధ్య గొడవ జరిగింది. మంచు మనోజ్ అనుచరులను విష్ణు బౌన్సర్లు బయటకు పంపుతున్నారు. బయటకు వచ్చి మనోజ్ బౌన్సర్లను విష్ణు తోసేశారు. ఈ సమయంలో మనోజ్ ఈ ఇంట్లో లేరు.

ఈ ఘటనపై మనోజ్ అనుచరులతో భూమా మౌనిక వీడియో కాల్ లో మాట్లాడారు. అదే సమయంలో పహడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు.

అసలు ఏం జరిగిందనే విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు.తొలుత మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి కౌంటర్ గా మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా మనోజ్, ఆయన భార్య మౌనికపై పోలీసులు కేసు పెట్టారు.డిసెంబర్ 8న తనపై దాడి చేశారని మంచు మనోజ్ తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ పుటేజీని మాయం చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు.ఈ సీసీపుటేజీని పరిశీలిస్తే మరికొన్ని అంశాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories