సర్కారు వారి పాట సినిమాలో జరిగిన తప్పు ఇదేనా?

Mistake Scene in Sarkaru Vaari Paata Movie | Telugu News
x

సర్కారు వారి పాట సినిమాలో జరిగిన తప్పు ఇదేనా?

Highlights

* సర్కారు వారి పాట సినిమాలో జరిగిన తప్పు ఇదేనా?

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో నటించిన "సర్కారు వారి పాట" సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకు వెళ్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఒక పెద్ద తప్పు జరిగిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఫారిన్ లో ఉన్నప్పుడు కీర్తి సురేష్ ముందు మహేష్ బాబు వద్ద 10 వేల డాలర్లు చదువు కోసం అంటూ అప్పు తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ లేట్ ఫీజు అంటూ మరొక 25 వేల డాలర్లను తీసుకుంటుంది. కానీ ఆ డబ్బు వసూలు చేసేందుకు ఇండియా వచ్చిన మహేష్ బాబు కీర్తి సురేష్ తండ్రి వద్ద కేవలం 10 వేల డాలర్లు మాత్రమే అడుగుతాడు. నిజానికి కీర్తి సురేష్ మహేష్ బాబు కి తిరిగి ఇవ్వాల్సింది 35 వేల డాలర్లు.

ఇలాంటి విషయాన్ని పరశురామ్ ఎలా మర్చిపోయాడు అని అభిమానులు షాక్ అవుతున్నారు అంతేకాకుండా అప్పటిదాకా నెగిటివ్ గా ఉండే కీర్తి సురేష్ సడన్గా తన తండ్రిని చూసి మంచిగా మారిపోవడం కూడా కొంత మందికి అంత లాజికల్గా అనిపించడం లేదు. ఏదేమైనా చిత్ర బృందం మాత్రం ఈ విషయంలో మౌనంగానే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories