Manushi Chiller: మిస్ వరల్డ్‌కు కలిసిరాని అదృష్టం.. ఐదు సినిమాలు డిజాస్టర్లే..

Miss World Manushi Chiller bad luck 5 movies are disasters
x

 మిస్ వరల్డ్‌కు కలిసిరాని అదృష్టం.. ఐదు సినిమాలు డిజాస్టర్లే..

Highlights

సాధారణంగా మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో సత్తా చాటారు. ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్ ఇలా ఎంతో మంది తమ నటనతో మెప్పించి సినీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు.

Manushi Chhillar: సాధారణంగా మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో సత్తా చాటారు. ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్ ఇలా ఎంతో మంది తమ నటనతో మెప్పించి సినీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల రేంజ్‌కు ఎదిగారు. అయితే మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలో మాత్రం సరైన క్రేజ్ అందుకోలేకపోతుంది. ప్రస్తుతం సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. ఆమె ఎవరో కాదు. హీరోయిన్ మానుషి చిల్లర్.

2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు మానుషి చిల్లర్. అయితే వెండితెరపై మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగు పెట్టారు. ఇప్పటి వరకు 5 సినిమాల్లో నటించించారు. కానీ అవన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు మానుషి. డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు రూ.220 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.68.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫస్ట్ మూవీ ప్లాప్ కావడంతో మానుషికి అంతగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత విక్కీ కౌశల్ జోడీగా ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం ప్లాప్ అయింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి 'బడే మియా చోటే మియా సినిమా సైతం బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె నటించిన తారిఖ్ మూవీ డిజాస్టర్ అయింది. మెగా హీరో వరుణ్ తేజ్ జోడిగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు రాలేదు. సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవాలని కోరిక ఆమెది. కానీ మానుషికి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం మానుషి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ మిస్ వరల్డ్‌కు సరైన క్రేజ్ వస్తుందేమో చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories