మీరా చోప్రా ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్

మీరా చోప్రా ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్
x
Highlights

న‌టి మీరా చోప్రాకు జూనియర్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య ట్విట్టర్ వేదికగా వివాదం కొనసాగుతుంది. ట్వీటర్ లో తనను అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న జూనియర్...

న‌టి మీరా చోప్రాకు జూనియర్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య ట్విట్టర్ వేదికగా వివాదం కొనసాగుతుంది. ట్వీటర్ లో తనను అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్వీట్ చేశారు. మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ , కవితకు ట్విట్ ట్యాగ్ చేశారు మీరా చోప్రా.

మీరా చోప్రా ట్విట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరా చోప్రా ఫిర్యాదు ఆధారంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కు అదేశించినట్లు కేటీఆర్ తెలిపారు. మీరా చోప్రా చేసిన ట్వీట్స్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల తో కేసు నమోదు చేసి, అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విటర్ అకౌంట్స్ ని గుర్తిస్తున్నారు. అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలుసులు వెల్లడించారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories