సరిలేరు నీకెవ్వరు నుంచి వీడియో లీక్

సరిలేరు నీకెవ్వరు నుంచి వీడియో లీక్
x
Mahesh babu
Highlights

పైరస్సి, షూటింగ్ సమయంలో వీడియోస్ లీక్ లను చిత్రపరిశ్రమ కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టు లోకి మహేష్...

పైరస్సి, షూటింగ్ సమయంలో వీడియోస్ లీక్ లను చిత్రపరిశ్రమ కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టు లోకి మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా చేరిపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఓ పాటకి సంబంధించిన వీడియో లీక్ అయింది. ఇందులో మహేష్ డాన్సులు కూడా నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.వీడియో లీక్ కావడం చిత్రయూనిట్‌ను కంగారు పెడుతుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అజయ్ రోల్ లో కనిపించనున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.. సంక్రాంతి పండగకి కానుకగా ఈ సినిమాని జనవరి 11 న విడుదల చేస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో రావు రమేష్, రాజేంద్రప్రసాద్, సంగీత, ప్రకాష్ రాజ్ , విజయశాంతి ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు , అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories