కూతురితో సినిమాలను నిర్మిస్తున్న హీరోయిన్ తల్లి

Megha Akash’s Mom Bindu Akash Turned Producer For Her Next Film
x

కూతురితో సినిమాలను నిర్మిస్తున్న హీరోయిన్ తల్లి

Highlights

కూతురితో సినిమాలను నిర్మిస్తున్న హీరోయిన్ తల్లి

Bindu Akash: చాలామంది హీరోయిన్లు షూటింగ్ సమయంలో తోడుగా తమ అమ్మలను తెస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ హీరోయిన్ల వెంటే సినిమా లొకేషన్ల లోనే ఉన్నప్పటికీ, సినిమాలకి దూరంగానే ఉంటారు. కానీ తాజాగా ఒక హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు మేఘా ఆకాష్. ఇంతకు ముందు ప్రియాంక చోప్రా వల్ల అమ్మ మధు చోప్రా కూడా పర్పుల్ పెబల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ తో నిర్మాతగా మారారు. తన కూతురిని హీరోయిన్ గా పెత్తి పలు సినిమాలు కూడా నిర్మించారు.

తాజాగా ఇప్పుడు మేఘ ఆకాష్ వాళ్ళ అమ్మ బిందు ఆకాష్ కూడా ఇప్పుడు నిర్మాత అవతారం ఎట్టబోతున్నారు. మేఘ ఆకాష్ ను హీరోయిన్ గా పెట్టి సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అభిమన్యు బడ్డి దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుండగా, బిందు ఆకాష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. "డియర్ మేఘా" ఫేమ్ సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories