Chiranjeevi: డిజే టిల్లుతో మెగాస్టార్ మల్టి స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

Megastar Multi-Starrer with DJ Tillu Who is the Director..?
x

Chiranjeevi: డిజే టిల్లుతో మెగాస్టార్ మల్టి స్టారర్..డైరెక్టర్ ఎవరంటే..?

Highlights

Chiranjeevi: ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో యంగ్ హీరో కూడా నటిస్తాడట.

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ఖైదీ నంబర్ 150తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత చేసిన సైరా నరసింహా రెడ్డి, ఆచార్య అంతగా మెప్పించలేదు. దీంతో చిరంజీవి సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేయాలంటూ విమర్శలు వినిపించాయి. అయితే మెగా స్టార్ మాత్రం గాడ్ ఫాదర్ సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టారు. ఈ సినిమా హిట్టవ్వడంతో వాల్తేరు వీరయ్య సినిమా చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా చిరంజీవి స్టార్డమ్ అంటే ఏంటో బాక్సాఫీసులకి మళ్లీ రుచి చూపించింది.

చిరంజీవి వింటేజ్ లుక్ కి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వాల్తేరు వీరయ్య హిట్టవ్వడంతో చిరు ప్రస్తుత్తం రెట్టించిన ఉత్సాహంతో సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మేడే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంది.

కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఇందులో చిరు ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాని ఆగస్ట్ 11న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా చిరంజీవి మరో యంగ్ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయన ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

చిరంజీవి-కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చే సినిమాని చిరు డాటర్ సుస్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్..టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో యంగ్ హీరో కూడా నటిస్తాడట. ఈ పాత్ర కోసం విజయదేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ పేర్లను దర్శకుడు పరిశీలిస్తున్నాడట. వీరిద్దరిలో ఎవరికి మెగా స్టార్ ఓకే చెబితే వారు ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మెగా ఆఫర్ సిద్ధు జొన్నలగడ్డను వరించనుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంబినేషన్ ఫైనలైజ్ కావాలని అటు చిరు ఫ్యాన్స్ ఇటు జొన్నలగడ్డ సిద్ధు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories