ఓ పిట్ట కథ కోసం చిరంజీవి

ఓ పిట్ట కథ కోసం చిరంజీవి
x
Chiranjeevi (File Photo)
Highlights

ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ఓ పిట్ట కథ.. కొత్తవాళ్ళతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ఓ పిట్ట కథ.. కొత్తవాళ్ళతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మాజీ ఓ కీలకపాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చ్ 6 న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగావచ్చే నెల ఒకటిన చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా, సునీల్ కుమార్ యన్ సినిమాటోగ్రఫీ అందించారు. డి.వెంకట ప్రభు ఎడిటర్. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు మాటలు అందించారు.

ఇక హీరో చిరంజీవి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హాజరవుతూ చిత్రానికి హైప్ క్రియేట్ చేస్తూ సినిమా విజయాలకు ఓ కారణం అవుతున్నారు. అప్పట్లో నిఖిల్ హీరోగా వచ్చిన అర్జున్ సురవరం, మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలకి చీఫ్ గెస్ట్ గా వెళ్లి చిత్ర విజయాలకు కారకులు అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో ఓ పిట్ట కథ అనే సినిమాని కూడా ప్రోత్సహించేందుకు చిరంజీవి వెళ్తున్నారు.

ఇక చిరు ప్రస్తుతం హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ , కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories