Chiranjeevi: చిరంజీవికి యూకే పార్లమెంట్ ప్రతిష్టాత్మక అవార్డు

Megastar Chiranjeevi to be felicitated by UK Parliament on March 19
x

Chiranjeevi: చిరంజీవికి యూకే పార్లమెంట్ ప్రతిష్టాత్మక అవార్డు

Highlights

Megastar Chiranjeevi: చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది.

Megastar Chiranjeevi: చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకుంటారు. 9 ఫిలింఫేర్, మూడు నంది అవార్డులతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు చిరంజీవిని వరించాయి. సినీ రంగానికి చిరంజీవి అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్ ఈ అవార్డు ఇవ్వనుంది. 2006లో చిరంజీవికి పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ ను కేంద్రం అందించింది.156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవికి చోటు దక్కింది.

సినిమా, ప్రజా సేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును అందించనున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కొన్ని రోజుల తర్వాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం చేశారు. దీంతో చిరంజీవిని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

2014 తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన ప్రధాని పాల్గొన్న కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం సాగింది. కానీ, తాను తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ఇటీవలనే చిరంజీవి ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories