మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అభిమానలందరికీ ఇన్సూరెన్స్..

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అభిమానలందరికీ ఇన్సూరెన్స్..
x
చిరంజీవి
Highlights

ఏ స్టార్ సినిమా అయిన హిట్ అవ్వాలంటే దాని వెనకాల వుండే సైన్యం ఫ్యాన్స్ మాత్రమే సినిమా ఓపినింగ్ నుండి రిలీజ్ వరకు ఫ్యాన్స్ హంగామా ఉండాల్సిందే. కటౌట్...

ఏ స్టార్ సినిమా అయిన హిట్ అవ్వాలంటే దాని వెనకాల వుండే సైన్యం ఫ్యాన్స్ మాత్రమే సినిమా ఓపినింగ్ నుండి రిలీజ్ వరకు ఫ్యాన్స్ హంగామా ఉండాల్సిందే. కటౌట్ నుండి పాలాభిషేకాల వరకు ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు, కారణం కేవలం ఆ స్టార్ ని అభిమానించటమే, ఇంత చేస్తే అభిమానులకు దక్కేదేంటి? సంతృప్తి మాత్రమే, అయితే ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు, ఫ్యాన్స్ కోసం ఎవరు చేయని పని ఆ మెగాస్టార్ చేయబోతున్నారు ఇంతకీ ఏం చేయబోతున్నారు?

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రెండు మూడు రోజుల్లో ఓ ప్రకటన మెగా ఫ్యాన్స్ వినబోతున్నారు, మెగా ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది దాకా ఉన్నారు. మెగా హీరో సినిమా ఎవరిదైనా రిలీజ్ అయితే చాలు ఫ్యాన్స్ కు పండగే అలాగే తమ హీరోల కోసం బాగానే శ్రమిస్తుంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా నడుంకట్టారు వాళ్లను ఆర్ధికంగా ఆదుకునేందుకు కార్యాచరణ ప్రారంభించారు.

జనవరిలో దానిని ఇంప్లీమెంట్ చేయబోతున్నారు మెగా చిరంజీవి. ఎన్నోకోట్ల మంది ఉన్న ఫ్యాన్స్ కు జీవిత బీమా పాలసీ చేయిస్తున్నారు, అఖిల భారత చిరంజీవి యువత దీని బాధ్యతలు తీసుకుంటుంది, మెగా అభిమానులందరూ వారి వివరాలను [email protected] కు మెయిల్ చేయాలని కోరారు. మెగా స్టార్ తన అభిమానులకు ఇన్సూరెన్స్ చేయిస్తుండటంపై అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories