చంటబ్బాయ్ పాత్రలో అల్లు అర్జున్..? వద్దు అంటున్న అభిమానులు..!

Megastar Chiranjeevi Said that Allu Arjun Set for Chantabbai Movie Remake in an Interview | Live News
x

చంటబ్బాయ్ పాత్రలో అల్లు అర్జున్..? వద్దు అంటున్న అభిమానులు..!

Highlights

Allu Arjun: బాలీవుడ్లో కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు...

Allu Arjun: తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవేళ తన సినిమాల్లో ఏదైనా సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటే ఏ సినిమాని చేస్తారు అని అడగగా చిరంజీవి వెంటనే రౌడీ అల్లుడు అని అన్నారు. అలాగే తను నటించిన బ్లాక్ బస్టర్ అయిన చంటబ్బాయి సినిమా ని అల్లు అర్జున్ రీమేక్ చేస్తే చాలా బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు చిరంజీవి.

అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి అందరినీ బాగా ఇమిటేట్ చేసే వాడని అందుకే చంటబ్బాయి పాత్రని కూడా తను బాగా చేయగలడని చెప్పుకొచ్చారు చిరంజీవి. అయితే ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. అల్లు అర్జున్ కూడా గతంలో రేసుగుర్రం, జులాయి వంటి సినిమాల్లో కామెడీ యాంగిల్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. కానీ పుష్ప వంటి సినిమాలతో అల్లు అర్జున్ రేంజి బాగా పెరిగింది.

బాలీవుడ్లో కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో కామెడీ సినిమాల్లో నటిస్తే బాగోదు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ ఆ పాత్రకీ సెట్ అవుతాడు అని చిరంజీవి అన్న మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి కి అది వర్కౌట్ అవ్వదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories