Chiranjeevi: బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న మెగాస్టార్..?

Megastar Chiranjeevi is looking for a Bollywood film
x
చిరంజీవి, అమితాబ్ బచ్చన్ (ఫొటో ట్విట్టర్)
Highlights

Chiranjeevi: మెగాస్టార్ చిరు బాలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ సినిమాలో నటించేందుకు సైన్ చేశాడని సమాచారం.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ ప్రధాన పాత్రలో వస్తున్న ఓ సినిమాలో నటించేందుకు సైన్ చేశాడని సమాచారం వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియల్సి ఉంది. అయితే మెగాస్టార్ ది మెయిన్ రోలా.. లేక గెస్ట్ రోలా అనేది కూడా ఇంకా తెలియదు.

గతంలో 'సైరా నరసింహారెడ్డి'లో అమితాబ్‌.. చిరంజీవికి గురువు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ మెగాస్టార్ గతంలోనూ కొన్ని హిందీ సినిమాల్లో నటించాడు. 1994లో చివరి సారి ది జంటిల్ మెన్ సినిమాతో బాలీవుడ్ లో కనిపించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తెలుగు, హిందీ మెగాస్టార్‌లు కలిసి ఓ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.

కాగా, చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. అయితే ఇల్లందులో జరుగుతున్న షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురి అయ్యాడని తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్ ను ప్రస్తుతానికి ఆపేశారని తెలుస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ ఆయనతో మరోసారి రోమాన్స్ చేస్తుండగా.. రామ్‌చరణ్‌ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. చెర్రీతో పూజా హెగ్డే జోడీ కడుతోంది. ఇందులో సోనూసూద్‌తో పాటు మరో నటుడు కూడా విలన్ పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ రెజీనా కసాండ్రా మెరిసినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories